Tuesday, September 28, 2010

గరుడ పురాణం - హిందూ ధర్మ సర్వస్వం

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హైదరాబాదులో గరుడపురాణం పై చెప్పిన ప్రవచనం రోజూ భక్తి టివి లో 8.30 ని లకు ప్రసారం అవుతున్నది.

నిన్న మొదటి భాగంలో ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనవై మీతో పంచుకొందామని పించింది.

హిందూ ధర్మానికి మూల గ్రంధాలు, మూడు రకాలు, అవి శృతులు (వేదాలు), స్మృతులు (ధర్మ గ్రంధాలు), పురాణాలు.

మొదలెక్కడో తెలియని హిందూ ధర్మ సూత్రాలను ద్వాపర యుగాంతంలో వేద వ్యాసుడు సూత్రీకరించారు. వేదాలను విభజించి చతుర్వేదాలుగా సూత్రీకరించినట్లే అష్టాదశ పురాణాలను పొందు పరిచారు.  పురాణాలు వేదాలకు భిన్నమైన విషయాలను కాక వేదాల్లో ప్రతిపాదించిన విషయాన్నే జనబాహుళ్యానికి అందే విధంగా చెబుతాయి.  అంటే పురాణాలు సామాన్యులకు అందే భాషలో, శైలిలో వేదోక్తమైన పరబ్రహ్మను వివరిస్తాయన్న మాట.  పురాణాలు వేదవ్యాసులు రచించినవైతే అవి వేదకాలం తర్వాతవి అనటం అవివేకమని శర్మగారు చెప్పారు. 

పురాణం లక్షణమేమిటంటే, అవి (౧) సృష్టి గూర్చి,  (౨)విలయం తర్వాత మళ్ళీ సృష్టించ బడటం గూర్చి, (౩)దేవతల, ఋషుల వంశాల గూర్చి,(౪) మన్వంతరాల గూర్చి, (౫) ఆ యా మనువుల్లో పాలించిన రాజులగూర్చి చెప్తాయి.  అన్నిపురాణాల్లో ఈ విషయాలున్నా కొన్నిటిలో కొన్ని విషయాల పై తక్కువ వివరణ మరికొన్నిటి పై ఎక్కువ వివరణ ఉంటాయి.

గరుడ పురాణం మిగిలిన అన్ని పురాణాల వలే చదువ తగినది, ఇంటిలో ఉంచుకో దగినది. దీన్ని అధ్యయనం చేసిన ఒక పాశ్చాత్య శాస్త్ర వేత్త దీనిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అన్నారు.

(మరిన్ని రేపు)

12 comments:

  1. మైత్రేయి గారూ:
    ఈ ప్రసంగాలు వినాలంటే ఎలా? భక్తి టీవీ ఆన్లైన్ వుందా?

    www.afsartelugu.blogspot.com

    ReplyDelete
  2. అంటే పురాణాలు సామాన్యులకు అందే భాషలో, శైలిలో వేదోక్తమైన పరబ్రహ్మను వివరిస్తాయన్న మాట.
    -----------------

    ఇప్పుడు తెలిసింది పురాణాలంటే ఏమిటో. థాంక్స్ ఫర్ ది పోస్ట్. గరుడ పురాణం కోసం ఎదురు చూస్తూ ఉంటా.

    ReplyDelete
  3. అయ్యా
    మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ టీవీ timings లో 8 .30 అన్న టైం ఉదయమా ? సాయంత్రమా ?అన్నది తెలియపరచండి
    దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవొద్దు .--మూర్తి

    ReplyDelete
  4. నేను 'అయ్య' కాదు 'అమ్మ' అండి.:). అది రాత్రి ఎనిమిదిన్నరకు ఒక అర గంట పాటు ప్రసారం అవుతున్నదండి.
    ఇది ఆన్లైన్ లో వస్తుందేమో నాకు తెలియదండి
    గరుడ పురాణం పై ప్రత్యేకంగా కొన్ని అపవాదులు ఉన్నాయండి. ముఖ్యంగా పితృకర్మల గూర్చి ఉంటుంది కనుక ఇది చదివిటం మంచిదికాదని కొందరు అపోహలో ఉంటారు. అందుకే ప్రతేకంగా అలాంటిది ఏమీ లేదని వారి గురువులను ప్రమాణికంగా చెప్తూ ఆయన చెప్పారు.

    ReplyDelete
  5. మైత్రేయి గారూ..మంచి విషయాలు చెప్తున్నారు...

    @అఫ్సర్ గారు,
    here is the online link for bhakti tv..its free and u can watch without interruption even on low speed networks......

    http://www.tvunetworks.com/watchTV/index.html#c=3909

    ReplyDelete
  6. నేను ఈ మద్య గరుడపురాణం చదువుదామని తెచ్చుకుంటే అందరూ అయ్యో అది ఇంట్లో వుండకూడదు , చదవకూడదు పారేయి అన్నారు . పారేసాను ! ఐతే చదవచ్చన్నమాట .

    ReplyDelete
  7. మాలా గారు, అవునండి. ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న అపవాదు. ఈ పురాణంలోని కొన్ని మంత్రాలు అపర కర్మలప్పుడు చదువుతారట. అందువల్ల ఆ మాట వాడుకలోకి వచ్చింది.
    కానీ వీరనదేది ఏమిటంటే, ఇంత పెద్ద గ్రంధంలో ఆ విషయం ఒక మూల ఉన్నది. అయినా శరీరానికి సంభంధించిన విషయాలు శరీరం ఉన్నప్పుడే తెలుసుకొనాలి కదా అని చమత్కరిస్తూ అవి తెలుసుకొన్నందు వల్ల మనం మన పెద్దలకు చెయ్యవలసిన పనులు చెయ్యటం, వారి ఋణం తీర్చుకోవటం, తద్వారా వారి కరుణకు పాత్రమవ్వటం, దాని ప్రాధాన్యత తెలుస్తుందన్నారు.

    ReplyDelete
  8. informative post. earlier my mother explained to us all the discourses she attended with my father. Infact, they took us for many discourses. She explained the ones both of them attended. Now I'm at chennai , far away from her. now I'll get updates from posts like yours.

    ReplyDelete
  9. garuda puranam gurchi detailed ga oka episode la thesthe bavutundhandi

    ReplyDelete
  10. nenu just entaku munde english lo archana vedanta ani oka site lo garuda purana shikshalu chadivanu,avi 28 unai anukuntanu.but akada naku oka doubt vachindi,shivuni agna lenidi chima ina kutadu antaru ante manam kuda a work chesina bagavantuni nunde velubadutundi kada.and naku avi sariga artam kaledu,so vatine miru telugu lo maku andinchagalara.
    thanks

    ReplyDelete
  11. @unknown,
    Samavedam Shanmukha sarma garu gave this lecture in secundrabad which was telecasted in Bhakti tv. I found it very interesting as it is not just any other puranam. It has loads of information.

    I think it will be available as CD with Sarma garu. We get get in touch with his sishyas (rushi peetham - http://rushipeetham.com/ ) . I will let you know if I get any information.

    ReplyDelete
  12. http://rushipeetham.org/index.php?page=shop.product_details&flypage=flypage.tpl&product_id=56&category_id=7&option=com_virtuemart&Itemid=69

    You can order VCD here.

    ReplyDelete