Friday, March 19, 2010

నా బుజ్జి రేడియో

ఎంతో మందికి లా నాకూ ఈ మధ్య రేడియో ఫ్రెండ్ అయిందండి.
హైపర్ సిటి, రాక్ సిటి హైదరాబాదు లో వచ్చేకొన్ని FM  ల గూర్చి ఈ చిన్ని పోస్టు.
నాకు బాగా నచ్చేవి బిగ్ లో శేఖర్ గజిబిజి పజిల్స్., శేఖర్, జో ల బాబా సూక్తులు (ప్రైజ్ గా బాబా బుర్ర లాంటి ఖాళి CD ఇస్తారట)
సిటి లో వంశి, శివ్ కామెడి అదుర్స్.
ఈ రోజు సిటి జోక్స్:-
"కుక్కలు పెళ్ళి ఎందుకు చేసుకోవు?  వాటిది ఆల్ రడీ కుక్క బతుకే కదా"
"సిగెరెట్లు మాన్పించటానికి మంచి అయిడియా:  సిగెరెట్ల పై అనుష్క బొమ్మ ప్రింట్ చేస్తే సరి. ఎవరూ కాల్చరు."
ఈ హడావిడికి విసుగని పిస్తే వివిధ భారతి ఉండనే ఉన్నది.
రైన్ బో లో హిందీ పాటల ప్రోగ్రాం కూడా బాగుంటుంది.  మంచి మంచి ఉర్దూ శేర్ లు షేర్ చేస్తుంటారు.
మిర్చిలో బేబి మమ్మి కొన్నాళ్ళు బాగా ఉన్నాయి. తర్వాత కుళ్ళిందనుకోండి. మిర్చి లో హరి కిషన్ గారి మిమిక్రి వాయిస్ తో వచ్చే ప్రకటనలు బాగుంటాయి.
అలాగే రేడియో సిటి లో వంశి కొన్నాళ్ళు స్వతంత్ర సంగ్రామం గూర్చి చెప్పిన బిట్స్ అద్భుతం.
అయితే కొందరు తిక్క జాకీల "అయ్యో నీకు బాయ్ ఫ్రండ్ లేడా" అనే చెత్త కామెంట్లు, పిచ్చి వాయిస్ మాడ్యులేషన్స్  చిరాకు తెప్పిస్తాయి.
మొత్తానికి బోరుకొట్టిచ్చే ట్రాఫిక్ జాంల నుంచి,  వంట, ఇంటి పని, టైలరింగ్ వంటి మోనటోనస్ పనుల విసుగు నుండి  విముక్తి ఈ FM
.
.మీకు గుర్తు ఉన్న, నచ్చిన  ప్రోగ్రాం ల గూర్చి రాయండి.

No comments:

Post a Comment