Wednesday, July 14, 2010

మన రాష్ట్రం లోని ప్రసిద్ధ ఆలయాలు -1

 చెన్నకేశవ స్వామి గుళ్ళు పల్నాడు ప్రాంతంలో ఐదు ఉన్నాయంటారు.
ఇది మాచర్ల చెన్నకేశవ స్వామి గుడి, తేరు., ఇక్కడ స్వామి మీసాలతో, ఖడ్గంతో, శంఖ చక్రాలతో, నగుమోముతో ఉంటాడు.





క్రిందిది మార్కాపురం చెన్నకేశవ స్వావి గుడి, అక్కడి అందమైన ఆంజనీయుడు. ఇక్కడ కూడా స్వామి చక్రధారియై దుష్టశిక్షణ కు సిద్ధంగా ఉంటాడు. మాచర్ల లోని తేరు లాంటిదే ఇక్కడా ఉంటుంది.  ఈ రెండు గుళ్ళల్లోనూ చైత్ర పౌర్ణమికి రధోత్సవం జరుగుతుంది.


మిగిలినవి ఎక్కడునాయో నాకు తెలియదు. 

సరస్వతీ దేవి గుళ్ళు: -  వర్గల్ లో ..


బాసర లో ..
పంచారామాలో ఒకటి దక్షిణ కాశి గా పేరు పొందిన ద్రాక్షారామం.,సప్త మాత్రుకల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటైన మాణిక్యాంబ వెలసి ఉన్నది. అమ్మవారు నల్ల రాతి తో చెయ్యబడి చూపుతిప్పుకోనియ్యనంత ఆకర్షణీయంగా, ఒకింత ఉగ్రంగా  ఉంటుంది.



 పంచారామాల్లో మరొకటి,  సామర్లకోటలోని కుమారారామం




పై రెండు గుళ్ళ నిర్మాణం ఒకే రకంగా ఉంటుంది. లోపల ఊగుతూ ఉండే రాతి ఉయ్యాల మండపం తో సహా! శివుడు పెద్ద లింగా కారంలో రెండు అంతస్తులలో ఉంటాడు. ఈ గుళ్ళు తూర్పు చాళుక్యులు  800 AD లో కట్టించారని అన్నారు.

2 comments:

  1. There is one chenna keshava temple at KAPRA, Hyderabad.

    ReplyDelete
  2. మీరు చెప్పిన గుడి ఎంత పురాతనమైనదో నాకు తెలియదు. ఈ గుళ్ళు మాత్రం పల్నాటి యుద్ధం కనా మునుపే ఉన్నాయంటారు. పల్నాటి వీర చరిత్రలో వీటి ప్రస్తావన ఉన్నదిట. చెన్నకేశవ స్వామి పేరుతో ఎక్కువ కర్ణాటక లో గుడులు ఉన్నాయి. నా ఉద్దేశ్యం ప్రకారం ఇవి పశ్చిమ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించి కట్టించారేమో. లేక అక్కడి గుడుల స్పూర్తితో మరే రాజైనా కట్టించి ఉండవచ్చు.

    ReplyDelete